జనం న్యూస్ 11మర్చి పెగడపల్లి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని కస్తూర్బా స్కూల్లో స్థానిక సర్పంచ్ ఓరుగల అరుణ శ్రీనివాస్ పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 41 మందికి పరీక్ష సామాగ్రి ప్యాడ్, పెన్నుమరియు స్కేలు తదితర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అందరూ 100% ఉత్తీర్ణత సాధించాలని కోరారు. అనంతరం స్కూల్ ఎస్ ఓ మీనాక్షి సర్పంచ్ ని శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు పెగడపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ డైరెక్టర్లు చాట్ల విజయభాస్కర్ చెట్ల కిషన్ మండల నాయకులు బండారి శ్రీనివాస్ మల్యాల ఎల్లయ్య గండ్ర శ్రీనివాస్ రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు.


