Listen to this article

జనంన్యూస్. 10.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.

నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రం లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మాస్ కాపీయింగ్ లేకుండా కట్టుదిట్టంగా నిర్వహించవలసిందిగా కోరడమైనది రాబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనవి. అయితే కొన్ని పరీక్షా కేంద్రాలలో మాస్ కాపీయింగ్ మరియు అన్యాయ పద్ధతులు జరుగుతున్నాయని ప్రజల్లో ఆందోళన ఉంది. దీనివల్ల నిజాయితీగా చదివే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది.అందువల్ల పరీక్షలు నిష్పక్షపాతంగా, కట్టుదిట్టంగా మరియు మాస్ కాపీయింగ్ లేకుండా నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని మనవి. పరీక్షా కేంద్రాల్లో సరైన పర్యవేక్షణ, ఫ్లయింగ్ స్క్వాడ్లు మరియు కఠిన నియంత్రణ ఉండేలా చర్యలు తీసుకోవాలని. స్థానిక మండల విద్యాఅధికారి రాములు నాయకు కు వినతి పత్రం ఇచ్చి పకడ్బందీగా నిర్వహించాలని కోరినాము ఈ విషయాన్ని గమనించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరడమైనది. కార్యక్రమంలో పిడిఎస్యు సిరికొండ మండల అధ్యక్షుడు మారుపాక రాజేష్. వంశీ.చరణ్.నీరజ్.రిషిత్. ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.