Listen to this article

జనం న్యూస్ మార్చి 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి

మహబూబాబాద్ జిల్లా ఇనుగర్తి మండలం క్షేత్ర సందర్శనలో భాగంగా చీఫ్ ఇంజనీర్ రాజు చౌహన్ ఇనుగుర్తి సెక్షన్ ఆఫీస్ సబ్ స్టేషన్ లను పరిశీలించారు. పరిశీలనలో భాగంగా సమ్మర్ ఆక్షన్ ప్లాన్ లో ట్రాన్స్ఫార్మర్లు పెట్టాలని అవసరమైన దగ్గర మిడిల్ పోల్స్ వేయాలని సూచించారు ప్రమాద భరితంగా ఉన్న ప్రదేశాలను త్వరగా సరిచేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆదేశించారు విధ్యుత్ వినియోగించు వారు పొదుపు గా వినియోగించుకోవాలి సూచనలు చేయాలని తెలిపారు వినియోగదారులు ఐ ఎస్ ఐ మార్క్ ఉన్న మోటార్స్ వైర్స్ స్టాటర్స్ వాడటం వలన ప్రమాదాలు తగ్గుతాయి ప్రతి ఒక్క వ్యవసాయ మోటార్స్ కి కేపాషిటర్స్ తప్పకుండ ఫిట్ చేసుకోవటం తప్పనిసరి అని ఆటో స్టాటర్స్ వాడకూడదు అని అన్నారు ప్రతి ఒక్కలు స్వతాగా విధ్యుత్ పనులు చేసుకోకుండా మా సిబ్బందికి సమాచారం చేస్తే సిబ్బంది వచ్చి చేస్తారు కావున తొందర పడి సొంతంగా విధ్యుత్ పనులు చేయకండి ప్రమాద బారిన పడకండి తెలిపారు ఇట్టి కార్యక్రమం లో ఏ డి ఇ రాములు , ఎ ఈ రాజు , ఎల్ ఐ బోడ శ్రీను, ఎల్ యం యశ్వంత్, ఎ ఎల్ యం అంబేద్కర్, సహాయకులు రమేష్, యాకన్నా తదితరులు పాల్గొన్నారు…..