జనం న్యూస్ మార్చి 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని ప్రాధమిక పశువైద్య శాలలో పశువులకు గాలి కుంటు నివారణ టీకాలు వేసి అనంతరం మండల పశువైద్య అధికారి డాక్టర్ యం సునీల్ మాట్లాడుతూ గాలి కుంటు టీకాలు వేయించడం వల్ల పశువుల్లో రోగనిరోధక శక్తి పెరిగి పశువులు ఆరోగ్యంతో పాటు ఉత్రత్తి పెరుగుదల ప్రత్యుత్పత్తి శక్తి పెరిగి రైతులకు లాభదాయకంగా ఉంటుంది అని అన్నారు ఈ యొక్క అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వి ఎల్ ఓ రమేష్ బాబు జే వి ఓ రవి వి ఎ సదానందం రైతులు పాల్గొన్నారు….


