Listen to this article

జనం న్యూస్ మార్చి 10 ముమ్మిడివరం ప్రతినిధి

కాట్రేనికోన మండలంలోని పలు గ్రామాల్లో బిక్షం ఎత్తుకొని సంచరించే మతిస్థిమితం లేని అనాధ వృద్ధురాలు మరణించింది. సోమవారం సాయంత్రం తిమ్మాపురం రామాయణం వద్ద అనారోగ్యంతో పడి ఉండడంతో పంచాయతీలో పనిచేసే ఈశ్వరరావు అనే వ్యక్తి ఆమెను 108 ద్వారా అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మరణించింది. ఏంటో సమీపంలోనే స్మశానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈశ్వరరావును పలువురు అభినందించారు