Listen to this article

జనం న్యూస్ మార్చి 10 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలప్ చెడ్: మండలంలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేజీవిబీ చిట్కుల్ పదవ తరగతి 225మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు, శిలాంపల్లి సర్పంచ్ రాజేందర్ రెడ్డి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా శిలాంపల్లి సర్పంచ్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పదవ తరగతి విద్యార్థులు విద్యార్థులు కష్టపడి 10 జిబి సాధించి మండలనికి మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సో మక్కపేట్ సర్పంచ్ బెస్తదుర్గ చలం, మండల విద్యాధికారి విఠల్,ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు, దనమూర్తి, తారాసింగ్, రమేష్ ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.