Listen to this article

జనం న్యూస్ మార్చి 10 , నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండలం:

రైతులు తమ గేదెలు, పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని మండల పశువైద్యాధికారిణి రాజ్యలక్ష్మి సూచించారు. మంగళవారం ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ భూషణ వేణి ప్రవీణ్ యాదవ్, ఉప సర్పంచ్ మూడ్ దయానంద్‌లతో కలిసి గేదెలు, పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో గేదెలు, పశువులు పెంచుతున్న రైతులు వాటికి గాలికుంటు వ్యాధి సోకకుండా ముందస్తు జాగ్రత్తగా టీకాలు వేయించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు భత్తుల సంజీవ్, లైవ్ స్టాక్ అధికారి నరేందర్, హెచ్‌ఏ మధుకర్, స్వప్న, గోపాలమిత్ర భూమారెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు