జనం న్యూస్ మార్చి(11) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో బుధవారం నాడు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాడికొండ సీతయ్య మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు గురయ్యే విధంగా గ్యాస్ సిలిండర్ ధర డొమెస్టిక్ సిలిండర్ పై 60 రూపాయలు కమర్షియల్ సిలిండర్ పై 140 రూపాయలు పెంచడానికి తీవ్రంగా ఖండించారు. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఎలాంటి పనులు వసూలు చేయమని ధరలు పెంచమని మాయమాటలు చెప్పి మూడుసార్లు అధికారాన్ని చేజిక్కించుకొని అంతా మరిచిపోయి ప్రజలపై భారం మోపడం సరికాదని అన్నారు. ఒకపక్క రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోవడంతో దాన ఇబ్బందులకు గురవుతున్న అన్ని వర్గాల ప్రజలకు మునిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా గ్యాస్ ధరలు పెంచడం అనేది విడ్డూరంగా ఉందని అన్నారు. అందుకే ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే ప్రజావ్యతిరేక విధానాలను గమనిస్తున్నారని తగిన సమయం లో గుణపాఠం చెప్తారని అన్నారు.


