జనం న్యూస్ మార్చ్ 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
మంగళవారం స్థానిక లక్ష్మీదేవిపేట సీతారామ కళ్యాణ మండపంలో అనకాపల్లి జిల్లా బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ప్రధాని మోదీ ఆలోచనలో పుట్టుకొచ్చిన స్త్రీ శక్తి పంచకం కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. అనకాపల్లి జిల్లా బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు ఓరుగంటి నాగమణి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు హాజరయ్యారు. భారీగా తరలివచ్చిన మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం మహిళల కోసం అధిక ప్రాధాన్యత ఇస్తూ అనేక పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మహిళల కోసం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు.ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు అందులో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ, బాలింతలకు ఆరోగ్య కిడ్స్ పంపిణీ, పేరొందిన క్రీడాకారులు ఉపాధ్యాయులు సంఘ సేవకులు తదితర ప్రముఖులను ఎమ్మెల్యే చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేసి సత్కారాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు, పొన్నగంటి అప్పారావు, బొడ్డేడ నాగేశ్వరరావు, ఉమ్మడి సుజాత, కట్టా పద్మ, మండల సంతోషి సుబ్బలక్ష్మి, తేజస్వి అనురాధ ,భానుమతి,కనకమహాలక్ష్మి,సత్యవాణి, సత్యవేణినాయుడమ్మ,తదితరులు పాల్గొన్నారు.


