జనం న్యూస్ 11 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
కొందరు వ్యక్తులు రాత్రివేళల్లో చెత్తను ఇక్కడ పడేస్తున్నారు. బిజెపి షాద్ నగర్ మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు మఠం ఋషికేష్. వార్డుల వారిగా షాద్ నగర్ పురపాలిక చెత్త సేకరణ వాహనదారుడి సెల్ ఫోన్ నెంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. సమస్య పరిష్కరించాలని షాద్ నగర్ మున్సిపల్ కమిషనర్ ను కోరుతున్న నాయకుడు.షాద్ నగర్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు రాత్రనక, పగలనక షాద్ నగర్ పట్టణాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దాలని స్వచ్ఛ్ షాద్ నగర్ లక్ష్యంగా పనిచేస్తుంటే షాద్నగర్ పుర పౌరులు కొందరు మాత్రం తమకేమాత్రం బాధ్యత లేదన్నట్టు బాధ్యతారహితంగా ఇలా “జడ్చర్ల పాత హైవే ఆర్టీవో కార్యాలయ” సమీపంలో చెత్త వేయడం సరైనది కాదు అలాగే తాము నివసిస్తున్న వార్డుకు ఒక గార్బేజ్ చెత్త సేకరించడానికి వాహనాలు రోజువారీగా అందుబాటులో ఉన్నాయి లేక మీరు మీ యొక్క ఉద్యోగరీత్యా సమయానికి చెత్తను సేకరించే వారికి వేయడానికి అందుబాటులో లేకపోతే ఇంటి దగ్గరే ఒక గార్బేజ్ డబ్బాను ఏర్పాటు చేసుకొని అందులో పొందుపరిస్తే చెత్త సేకరించడానికి వచ్చిన వ్యక్తికి సమాచారం ఇచ్చి తీసుకెళ్లేలా ప్రత్యామ్నాయంగా ఆలోచించాలి తప్ప ఇలా తమకు ఏ మాత్రం పట్టనట్టుగా రోడ్డుపై చెత్త వేయడం సరైనది కాదు అలాగే షాద్ నగర్ పట్టణ అభివృద్ధి కేవలం ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు లేదా ఇతర నాయకుల బాధ్యత కాదు షాద్ నగర్ పట్టణంలో నివసిస్తున్న ప్రతి ఒక్క షాద్నగర్ పుర పౌరుడు బాధ్యత వహిస్తేనే షాద్ నగర్ పట్టణం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా బాధ్యత వహించాలని బిజెపి షాద్ నగర్ మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు మఠం ఋషికేష్ తమయొక్క ప్రకటన ద్వారా తెలియజేశారు..


