జనం న్యూస్ 12మర్చి పెగడపల్లి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడుకోలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు లచ్చయ్య సరస్వతి మాతకు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంబించారు.ఇట్టి కార్యక్రమం లో విద్యార్థులు తమ అనుభవాలు, అనుభూతులను పంచుకున్నారు. విద్యార్థులు పాటలతో, డ్యాన్సులతో ఊర్రూతలు ఊగించినారు, విద్యార్థులు మిటాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేసి, 10వ తరగతిలో 100% పాస్ అవుతామని తెలిపినారు. ఇట్టి కార్యక్రమం లో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు లచ్చయ్య, ఉపాధ్యాయులు మాధవి, జ్యోతి, శంకరయ్య, శ్రావణకుమార్, లక్ష్మణ్, శ్రీనివాస్, విజయకుమార్, వేణుగోపాల్, పరమేశ్వర్, శ్రీధర్, మంజుభార్గవి, రమేష్, అనురాధ, అహమ్మదుఖాన్ విద్యార్థులు పాల్గొన్నారు


