జనం న్యూస్ మార్చి 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన,
ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పి ఎం జె జె బి వై) పథకం ద్వారా వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు చెల్లించడం ద్వారా సహజ మరణం పొందిన ఖాతాదారునికి రెండు లక్షల రూపాయల జీవిత బీమా లభిస్తుందని కాట్రేనికోన స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ జి బి వి రమణ తెలిపారు. కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామానికి చెందిన చెక్క గంగాయమ్మ ఇటీవల మరణించగా ఆయన భర్త చెక్క గంగ రాజు కి రెండు లక్షల రూపాయల బీమా చెక్కును బుధవారం మేనేజర్ అందించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ బ్యాంకులో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ జీవిత బీమా, ప్రమాద బీమా పాలసీ చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ మహేష్ బాబు, సతీష్, విజయ్ కుమార్ , ప్రశాంత్ ఇంకా స్టేట్ బ్యాంక్ సిబ్బంది, కియోస్క్ బ్యాంక్ ఆపరేటర్లు పెయ్యల సురేష్ బాబు, పాలెపు సత్యానందం , మల్లాడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


