Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.

నందలూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణ HPV వ్యాక్సినేషన్ 14 సంవత్సరాల బాలికలు ఉపయోగించు కోవాలి అనే కార్యక్రమంలో నందలూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ శరత్ కమల్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగినది అలాగే బిజెపి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చే ఈ యొక్క హెచ్ పి వి గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ ను మన భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టా ఈత్మకంగా చేపట్టడం జరిగి నదని ఈ యొక్క వ్యాక్సిన్ను 14 సంవత్సరాల బాలికలు పొందడం వలన రాబోవు కాలంలో వారికి పూర్తిగా గర్భాశయ ముఖ క్యాన్సర్ ను నివారించవచ్చని తెలియ జేయడం జరిగినది ఇందులో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ యొక్క వ్యాక్సిన్ ఉపయోగాలను 14 సంవత్సరాల బాలికలు రాష్ట్రంలోని ప్రతి ఆరోగ్య కేంద్రంలో లభ్యమయ్యేలా ఏర్పాటు చేశారని తెలియ జేయడం జరిగినది ఇది బయట ప్రైవేటుగా కొనాలంటే దరిదాపుగా 5000 రూపాయల వరకు డబ్బులు ఖర్చు అవుతాయని తెలియజేయడం అలా కాకుండా ఉచితంగా ఈ యొక్క హెచ్ పి వి వ్యాక్సిన్ ను 14 సంవత్సరాల బాలికలకు ఉచితంగా ఈ యొక్క వ్యాక్సిన్ అందించడం జరిగినది అని మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కి కృతజ్ఞతలు తెలపడం జరిగినది అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ప్రతి ఒక్క సిబ్బంది ప్రతి ఒక్క పౌరులకు ఈ యొక్క వ్యాక్సిన్ ఉపయోగాలు తెలియపరచి వారి అపోహలు తొలగిపోయేలా వివరించి వారి యొక్క ఆరోగ్యానికి సహాయపడాలని తెలపడం జరిగినది. అలాగే మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు మరియు ఆరోగ్య సిబ్బందికి అభి నందనలు కూడా తెలపడం జరిగినది అలాగే ఈ రోజున ఈ యొక్క HPV వ్యాక్సి నేషన్ వేయించు కున్నటు వంటి బాలికలకు డాక్టర్ శరత్ కమల్ కుమార్ పుస్తక రూపంలో బహు మతులు కూడా ప్రధానం చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు మరియు భారతీయ జనతా పార్టీ మండల నాయకులుషబ్బీర్అహ్మద్,కోడూరు ఆది నారాయణ రాచూరి మురళి వీరబల్లి జయకుమార్ రెడ్డి, తదితరులు పాల్గొనడం జరిగినది.