Listen to this article

జనం న్యూస్ మార్చ్ 12 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

భీమనపల్లి: హెచ్పీవీ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనదని, బాలికలు తప్పనిసరిగా వేసుకోవడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుందని రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం తెలిపారు. భీమనపల్లి పీహెచ్సీలో నిర్వహిస్తున్న హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రాము సందర్శించారు. ఆయన మాట్లాడుతూ స్వస్త్ నారీ సశక్తి పరివార్ లో భాగంగా మహిళలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు కేంద్ర ప్రభుత్వం హెచ్పీ వ్యాక్సిన్ వేస్తున్నార న్నారని తెలిపారు. ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదని ఆయన వివరించారు. కార్యక్రమంలో పీహెచ్సీ డాక్టర్ మరి సూపర్వైజర్లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు