Listen to this article

ఏర్గట్ల, మార్చి 12:


ఏర్గట్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులు, వైద్య సిబ్బంది కోసం ప్యూరిఫైడ్ ఫిల్టర్ వాటర్ మిషన్‌ను ఏర్పాటు చేశారు. క్రీస్తు శేషులు మాజీ సొసైటీ ఛైర్మన్ శివన్నోల్ల రాజన్న స్మారకార్థంగా ఆయన కుమారుడు శివన్నోల్ల రాజు స్వంత ఖర్చులతో ఈ మిషన్‌ను ఏర్పాటు చేశారు.ఈ మిషన్‌ను ప్రభుత్వ వైద్యకారిణి డాక్టర్ అంబిక ప్రారంభించారు. ఇప్పటి వరకు ఫిల్టర్ నీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఉండగా, ఇప్పుడు రోగులకు త్రాగునీటి సమస్య తీరిందని తెలిపారు. పాముకాటు, కుక్కకాటు మందులు ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్, రేండ్ల రాజారెడ్డి, పి హెచ్ ఎన్ ఇందిరా, సున్నపు అంజయ్య తదితరులు పాల్గొన్నారు