జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 12-03-26
పవిత్ర రంజాన్ మాసం నడుస్తున్న సందర్భంగా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని గాంధీనగర్ మరియు ఆరవపల్లె లో ముస్లిం మైనారిటీ నాయకులు మానవత్వాన్ని చాటు కున్నారు. నిరుపేద ముస్లిం కుటుంబాలకు అండగా నిలవాలనే సంకల్పంతో ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ మౌలా మరియు పఠాన్ మెహర్ ఖాన్ ఆధ్వర్యంలో గురువారం 40 నిరుపేద కుటుంబాలకు ‘రంజాన్ తోఫా’ పంపిణీ చేశారు.15 రకాల నిత్యవసర సరుకులురంజాన్ మాసంలో పేదవారు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో, ప్రతి కుటుంబానికి దాదాపు 15 రకాల నిత్యవసర వస్తు వులతో కూడిన కిట్‌ను అంద జేశారు. ఇందులో బియ్యం, పప్పులు, నూనె, పంచదార వంటి అత్యవసర సరుకులు ఉన్నాయి. తోఫా అందుకున్న మహిళలు మరియు వృద్ధులు సంతోషం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.మానవత్వమే మా నినాదంఈ సందర్భంగా షేక్ మౌలా మరియు పఠాన్ మెహర్ ఖాన్ మాట్లాడుతూ..”ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా నిరుపేదలకు సాయం చేయడాన్ని ఒక బాధ్యతగా భావిస్తున్నాము. సేవ చేయడంలో ఉండే తృప్తి మరెందులోనూ ఉండదు. ఈ సేవా కార్యక్రమంలో ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వంతు సహ కారాన్ని అందించవచ్చు. రాబోయే రోజుల్లో మరిన్ని కుటుంబాలకు సాయం అందించేలా కృషి చేస్తాం.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు మరియు యువత పాల్గొని పంపిణీ సజావుగా సాగేలా సహ కరించారు. సరుకులు అందుకున్న ఆడపడుచులు తమ ముఖాల్లోచిరునవ్వుతో, సంతోషంగా ఇళ్లకు వెళ్లడం అందరినీ ఆకట్టుకుంది.



