జనంన్యూస్. 12.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన Cr.No. 31/2019 U/s 380 IPC కేసుకు సంబంధించి ఈరోజు కోర్టు తీర్పు వెలువడినది.వివరాల్లోకి వెళితే, తేదీ 05.05.2019 రోజున మెట్టు మరి తాండ గ్రామం, సిరికొండ మండలం నివాసి అయిన కేతావత్ రవి S/o సంగ్య అనే వ్యక్తి, ఫిర్యాది అజ్మీర్ బులిబాయి గారి ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో అక్రమంగా ఇంటిలోకి ప్రవేశించి, ఇంటిలోని బీరువాలో నుండి రూ.50,000/- నగదును దొంగతనం చేసినాడు.ఈ ఘటనపై సిరికొండ పోలీస్ స్టేషన్లో Cr.No.31/2019 U/s 380 IPC కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగింది. అనంతరం కేసును కోర్టులో విచారణకు ప్రవేశపెట్టడం జరిగింది.కేసు విచారణ పూర్తయ్యాక ఈరోజు గౌరవనీయులైన 1st AJFCM కోర్టు, ఆర్మూర్ లో న్యాయమూర్తి కుమారి CH. భవ్య శ్రీ నిందితుడు కేతావత్ రవి కి ఒక సంవత్సరం సాదారానా జైలు శిక్ష మరియు రూ.5,000/- జరిమానా విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది.ఈ కేసు విచారణలో సహకరించిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.


