జనం న్యూస్, మార్చి 13, తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని టిపిసిసి ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు.రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన “ఈద్ కా తోఫా” కానుకలను శుక్రవారం మోతీనగర్ బబ్బుగూడ ప్రాంతంలో ముస్లిం మహిళలకు బండి రమేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, పండుగలను అందరూ సంతోషంగా జరుపుకునేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని అన్నారు. శాంతియుత వాతావరణంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో కలిసి రంజాన్ ఉత్సవాన్ని జరుపుకుంటున్న ముస్లిం సోదరులను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో గోపిశెట్టి రాఘవేందర్, మజీద్ కమిటీ సభ్యులు ఇమ్రాన్, ఇస్మాయిల్, సలీం, నయీం, బకరం బుచ్చయ్య, సుదాకర్ రెడ్డి, రాజేష్, శ్రీను, ఇర్ఫాన్, వసీం, గోపాల్ చౌదరి, కమ్మర్ ఉద్దీన్, ఆనంద్ రెడ్డి, కోటిరెడ్డి, వెంకటేష్ గౌడ్, షకీర్, రంగప్ప, కురువ రాజు, ప్రసాద్, శివ, సాథ్విక్ తదితరులు పాల్గొన్నారు.



