Listen to this article


పరీక్ష కేంద్రాన్ని పర్యవేక్షించిన మండల విద్యాధికారి విట్టల్

జనం న్యూస్ మార్చి 13 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపి చెడు మండల కేంద్రంలో రేపటినుండి జరిగే పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది మండలంలోని ఐదు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి 134 విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాస్తున్నారు పరీక్షా కేంద్రంలో సౌకర్యాలైన విద్యతో తాగునీటి వసతి శౌ చాలయాలు పూర్తి చేయడం జరిగింది మండల విద్యాధికారి మాట్లాడుతూ విద్యార్థులు మొదటి రోజు పరీక్షకు ఒక గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని తెలియజేయడం జరిగింది విద్యార్థులు పరీక్షలను ప్రశాంతంగా ఎలాంటి ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ గాని స్మార్ట్ వాచీలు గాని తీసుకుని పరీక్ష కేంద్రానికి రావద్దు అని తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ పరీక్ష సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయానికి పరీక్ష కేంద్రానికి తీసుకురావాలని తెలియజేయడం జరిగింది అదేవిధంగా విద్యార్థులు ఉదయం పరీక్ష కేంద్రానికి వచ్చే ముందు తేలికపాటి అల్పాహారం తీసుకుని రావాలని మరియు విద్యార్థులు రాత్రి తొందరగా పడుకొని ఉదయం తొందరగా లేసి పరీక్షకు సంసిద్ధులు రావాలని అలాగే విద్యార్థులు కచ్చితంగా పరీక్షకు వచ్చే ముందు హాల్ టికెట్స్ తీసుకొని పరీక్ష కేంద్రానికి రావాలని తెలియజేయడం జరిగింది హాల్టికెట్స్ దీనితో పరిషత్ కేంద్రంలోకి అనుమతించరని చెప్పడం జరిగింది. ఈసారి ప్రభుత్వం పరీక్షలలో మార్పులు తీసుకురావడం జరిగింది విద్యార్థులకు 24 పేజీల బుక్ లేట్ ఇవ్వడం జరుగుతుంది ప్రశ్నాపత్రంలో ప్రతి పేజీకి క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులు పరీక్షలను ఒక పండుగ వాతావరణం లో రాయాలని సూచించడం జరిగింది పదవ తరగతి విద్యార్థుల కోసం సంవత్సరము నుండి బోధించిన ఉపాధ్యాయులకు మరియు ప్రధానోపాధ్యాయులకు మండల విద్యాశాఖ తరఫున అభినందించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది పదో తరగతి రాసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి విట్టల్ చీఫ్ సూపరిండెంట్ ధన సింగ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ రమేష్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ ఇన్విజిలేటర్లు పాల్గొన్నారు