Listen to this article

జనం న్యూస్ రిపోర్టర్ వికారాబాద్ జిల్లా డిస్టిక్ ఇంచార్జ్ కావలి నర్సిములు. జనం న్యూస్ 14 మార్చి వికారాబాద్ జిల్లా

ప్రియమైన విద్యార్థిని విద్యార్థులరా మీ యొక్క బంగారు భవిష్యత్తుకు పదవ తరగతి పరీక్షలు తొలిమెట్టు లాంటివి.. ఈ సమయంలో మీరు భయం వీడండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో ఎలాంటి సంకోచము, ఒత్తిడి లేకుండా పరీక్షలకు సరైన సమయానికి హాజరై నిర్భయంగా అద్భుతమైన ఫలితాలు సాధించాలని హృదయ పూర్వకంగా కోరుతున్నాను. మీరు 10 వ తరగతి లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మీ తల్లిదండ్రులు, మీ ఉపాధ్యాయులు మీ విజయం కోసం ఎలా ఎదురు చూస్తారో నేను కూడా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మీ విజయం కోసం ఎల్లప్పుడూ వేచిచూస్తాను.