Listen to this article

జనం న్యూస్ మార్చ్ 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

ముస్లిముల పవిత్ర రంజాన్ మాసం శుభ సందర్భంగా అనకాపల్లి చిన్న నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద గల మసీదులో ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు మసీదులో జరుగుతున్న రంజాన్ వేడుకల్లో అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ భీమరశెట్టి రామ్కి పాల్గొన్నారు. ముస్లిం సోదరులు రామ్ కి కి ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో రామ్ విందును స్వీకరించి, ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు.