Listen to this article

జనం న్యూస్, మార్చి 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి

ప్రజల సమస్యల పరిష్కారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ అన్నారు. స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్ధర్ నగర్ ప్రాంతంలో శనివారం ఆయన స్థానిక నాయకులతో కలిసి పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కాలనీలో పలు చోట్ల ఉన్న రహదారుల దుస్థితి, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి ఇబ్బందులు వంటి అంశాలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను పరిశీలించిన బండి రమేష్ వెంటనే వాటర్ వర్క్స్ జీఎంతో ఫోన్‌లో మాట్లాడి సమస్య పరిష్కారంపై చర్చించారు. దీనిపై స్పందించిన అధికారులు తక్షణమే సంబంధిత ఏరియా ఈఈని పంపించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.అలాగే ముందుగా డ్రైనేజీ లైన్ ఏర్పాటు చేసి అనంతరం రహదారులను నిర్మించేలా చర్యలు తీసుకుంటామని బండి రమేష్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి వెంటనే స్పందించినందుకు స్థానిక ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సాయి తులసి, బర్కత్ అలీ ఖాన్, శంకర్, మొయినుద్దీన్, జమీర్, లక్ష్మణ్ గౌడ్, విటల్ రెడ్డి, మస్తాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.