Listen to this article

జనం న్యూస్,మార్చి14,

జనం న్యూస్: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే జనసైనికులకు, మెగా అభిమానులకు ఒక పండుగ. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి భారీ స్థాయిలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు.అందులో భాగంగానే ఈరోజు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజవర్గం రాంబిల్లి మండలం వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేసి ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ నిర్వహించారు.
పార్టీ ఆఫీసులో క్యాంపు నిర్వహించడంతోపాటు ఫ్రూట్స్ పంపిణీ చేశారు..ఎలమంచిలి నియోజకవర్గంలో ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జన సైనికులు,వీర మహిళలు గ్రామాల్లో వార్డుల్లో పంచాయతీలలో జనసేన జెండా ఎగరవేసి సేవా కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జన సైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.