పంచాయతీ రాజ్ శాఖతో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమీక్షా సమావేశం
జుక్కల్ మార్చ్ 14 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీ కాంతారావు పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని గ్రామీణ రహదారుల పరిస్థితిపై అధికారులతో విస్తృతంగా చర్చించారు..చెడు స్థితిలో ఉన్న రహదారులను గుర్తించి వాటి మరమ్మతులకు మరియు కొత్త రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.ప్రజలు సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించేలా రహదారి వ్యవస్థను మెరుగుపర్చాలని ఎమ్మెల్యే తెలిపారు..అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసి, అవసరమైన అన్ని చర్యలు తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు..గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు మరియు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు..



