జనం న్యూస్ 14 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
సాధించుకున్న హక్కులను నిలబెట్టుకుందాం-వాటి అమలుకై పోరాడుదాం. మార్చి 16న జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ల వద్ద మహాధర్నాలు గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో గోడ పత్రికలు విడుదల చేసి ఈ సందర్భంగా జమ్మిచెడు కార్తీక్ మాట్లాడుతూ.2026 ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి వస్తున్న లేబర్ కోడ్స్ కార్మికవర్గానికీ ఉరితాళ్లు కానున్నాయి అని అన్నారు. కనుక దేశ కార్మిక వర్గానికి మరణ శాసనాలైనా నాలుగు లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ యాప్ టి యు ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది అని అన్నారు .గత ప్రభుత్వ రూపొందించిన రూల్స్ను రద్దుచేస్తూ తెలంగాణ రాష్ట్రంలో లేబర్ కోడ్స్న అమలు చేయమంటూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ద్వారా ఒక తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు పంపాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐ యాప్ టి యు రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది అని అన్నారు.లేబర్ కోడ్స్లో కార్మికుల వేతనాలు, పని పరిస్థితులు, జీవన ప్రమాణాలు పెంచే అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే భూతద్దం వేసిచూసిన కనపడవు. కార్మికుడు కార్మిక సంఘాల నిర్వచనాలనే పూర్తిగా ఈ కోడ్స్ మార్చివేశాయి అని అన్నారు. వేతనాల విషయంలో యాజమాన్యాలది పూర్తి బాధ్యత అని అన్ని రకాల వివాదంశాలపై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వాన్ని దేనని ఈ కోడ్స్ పేర్కొంటున్నాయి. వేతన కోడ్ జీవన వ్యయ సూచికలు ప్రాంతీయ వైవిధ్యాలను పరిగణలోకి తీసుకో లేదు. వేతనాలను నిర్ణయించే అధికారం కేంద్రీకృతం చేస్తుంది. తద్వారా ఏకపక్ష ఫ్లోర్ లెవెల్ వేతనం నిర్ణయించబడుతుంది. దీని వల్లకార్మికుల కొనుగోలు శక్తిని జీవన ప్రమాణాలకు తీవ్రమైన విఘాతం ఏర్పడుతుంది. ఫ్లోర్ లెవెల్ వేజ్ వ్యవస్థ కనీస వేతనాల శాస్త్రీయ నిర్ణయాత్మక శక్తిని బలహీనపరుస్తుంది. ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లేబర్ కోడ్స్ విషయంలో ఏదైనా వివాదం ఏర్పడితే కేంద్రానిదే అంతిమ నిర్ణయం అని ఈ కోడ్స్ స్పష్టం చేశాయి.కేంద్ర స్థాయిలో ఉన్న పాత చట్టాల్లో యూనియన్లను యాజమాన్యాలు గుర్తించాలన్న నిబంధన లేదు. రిజిస్టరయిన అన్ని యూనియన్లు డిమాండ్ల పత్రాన్ని రూపొందించే హక్కును, వాటిపై సమ్మెలోకి వెళ్లి, తనతో సంప్రదింపులు జరపమని ప్రభుత్వం/ యాజమాన్యంపై ఒత్తిడి చేసే హక్కును కార్మికులు కలిగి ఉన్నారు అని అన్నారు. నిజానికి యూనియన్ లేకపోయినా ఒక కార్మిక జనరల్ బాడీ సమావేశంలో ఎంపికైన ఐదుగురు కార్మిక ప్రతినిధులను కూడా డిమాండ్ పత్రాలు రూపొందించి సమ్మె నోటీసు ఇచ్చి సంప్రదింపులు జరపమని ఒత్తిడి చేసి ఒప్పందం చేయవచ్చును అని తెలిపారు. ఈ హక్కులను ఐఆర్ కోడ్ పూర్తిగా నిరాకరిస్తుంది. లేబర్ కోడ్స్లోని సెక్షన్ 62(1) సమ్మె హక్కును, సెక్షన్ 6(2),6(4) యూనియన్లను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని సంక్షిప్తం చేయడమే కాక క్రమంగా వాటిని సంపూర్ణంగా నిరాకరిస్తాయి.ప్రస్తుత నూతన ఐఆర్ కోడ్ ప్రకారం ఒక పరిశ్రమలో 51 శాతం లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికుల సభ్యత్వం కలిగిన సంఘాన్నే గుర్తింపు సంఘంగా గుర్తిస్తారు వారితోనే యజమాన్యం ప్రభుత్వ సంప్రదింపులు జరుగుతుంది అని అన్నారు. లేబర్ కోర్సును రద్దు చేయను పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో.. యువరాజు సుధాకర్ గణేష్ పగుల్ రాజు ప్రేమ రాజు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు


