జనం న్యూస్ – మార్చి 14
నిజామాబాద్ జిల్లా, ఏర్గట్ల మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి 60వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరై కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఏనుగందుల రాజా పూర్ణానందం మాట్లాడుతూ, ప్రశాంత్ రెడ్డి గారు తన–పర అనే భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు తీసుకెళ్లే ప్రజానాయకుడని కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా ప్రజల విశ్వాసాన్ని పొందారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏర్గట్ల సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, దోంచందా సర్పంచ్ పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచులు, గ్రామాల అద్యక్షులు,నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.


