Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 14-03-26

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ మహోత్సవాన్ని పురస్కరించుకొని నందలూరు మండలం జనసేన పార్టీ మరియు గురివిగారి వాసు ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. ముఖ్య అతిధిగా రాజంపేట జనసేన పార్టీ పార్లమెంటు సమన్వయకర్త అతికారి కృష్ణ విచ్చేసి జన సైనికుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మరియు జెండా ఆవిష్కరించడం జరిగింది.అలాగే పేట్టగెడ్డలో జనసేన నాయకులు కేదార్నాథ్ బాబు ఆధ్వర్యంలో అతికారి క్రిష్ణ పేట్టగడ్డ యువత తో కలిసి కేక్ కట్ చేసి ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు బ్రేడ్ మరియు పండ్లు పంపిణీ కార్యక్రమము లోపొల్గొన్నారు .ఈ సంద ర్భంగా అతికారి క్రిష్ణ మాట్లాడుతూ సరిగ్గా 13 సంవత్సరాల క్రితం కొణిదెల పవన్ కళ్యాణ్ అనే ఒక యోధుని హృదయాం తరాళం నుండి పేద బడుగు బలహీన మైనారిటీ ప్రజల యొక్క అభ్యుదయం కోసం, వారి యొక్క హక్కుల కోసం ప్రశ్నించ డానికి పుట్టిన పార్టీ జనసేన పార్టీ.. అని అన్నారు అలాంటి ఒక మహా శక్తిని తన యొక్క క్రమశిక్షణతో నడుపుతున్నటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ పేదల యొక్క సేవే పరమావధిగా పేద ప్రజల యొక్క సమస్యల పరిష్కారమే తన అజెండాగా పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో నేను సైతం అంటూ ముందు ఉంటా అంటూ క్రిష్ణ ప్రసంగించారు.ఈ కార్య క్రమంలో నందలూరు జనసేన సీనియర్ నాయకులు శివ గౌడ్ అరుణ్ పాండే, టంగుటూరు ఈశ్వర్ , హోటల్ శివ, బన్నీ, ప్రతాప్, వాసు రెడ్డి, లేబాక ప్రవీణ్,నరహరి, మస్తాన్ రాయల్, శేఖర్,