జనం న్యూస్, మార్చి 14 (ఏర్గట్ల): నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి మందిరంలో మండల కాంగ్రెస్ పార్టీ, టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి మాలధారణ భక్తులకు భిక్ష కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం రాకేష్ పంతులు సమక్షంలో జరిగింది.ఏర్గట్ల మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి సుమారు 200 మంది హనుమాన్ మాలధారణ భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా స్వాములకు భిక్ష సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలకు అన్నదానం కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, పార్టీల తరపున స్వాములకు భిక్ష సమర్పించడం ఇదే తొలిసారి అని, భవిష్యత్తులో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. భక్తి భావనను పెంపొందించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.కార్యక్రమానికి సహకరించిన వారికి ఇంటిలో పూజించుకునేందుకు శ్రీ ఆంజనేయ స్వామి చిత్రపటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలధారణ భక్తులు, కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



