

జనం న్యూస్ ఫిబ్రవరి 13 ముద్దనూరు : ముద్దనూరు మండలంలోని యామవరం రైతు సేవా కేంద్రంలో పొలం పిలుస్తోంది కార్యక్రమము గ్రామ సభ సమావేశంలో ఎడిఏ వి.వెంకట సుబ్బయ్య పాల్గోన్నట్లు మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు.ఈ సంధర్భంగా ఏడీ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ సొంత పొలం కలిగిన ప్రతి రైతు విశిష్ట గుర్తింపు కొరకు రైతు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని అన్నారు.రైతులు వ్యవసాయ శాఖ ద్వారా అమలు చేసే అన్ని పథకాలను పొందాలి అంటే రైతులు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అన్నారు.పంట నమోదు చేసుకున్న ప్రతి ఈ కేవైసి చేసుకొని లబ్ది పొందాలి అన్నారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు,వ్యవసాయ శాఖ ద్వారా అమలు చేసే ప్రతి పథకం లబ్ది పొందాలి అంటే రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకొని విశిష్ట గుర్తింపు సంఖ్య పొందాలి అన్నారు.సొంత భూమి కలిగిన ప్రతి రైతు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలి అన్నారు.రైతుకు ఎన్ని గ్రామాల్లో పొలం ఉన్న ఎక్కడో,ఒక చోట మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది అన్నారు.తదుపరి గ్రామంలో సాగు చేసిన మొక్క జొన్న పంటను పరిశీలించి రైతులకు సస్య రక్షణ చర్యలు మరియు సలహాలు సూచనలు అందించారు.కంకి ఏర్పడే దశలో పోటాష్ ఎరువులు తప్పనిసరిగా వాడాలి అన్నారు.పోటాష్ లోపం వలన కంకి నాణ్యత సరిగా లేక గింజ నాణ్యత కూడా ఉండదు అన్నారు.పోటాష్ లోపం రాకుండా సిపారస్ చేసిన మేరకు పోటాష్ ఎరువులు వాడాలి అన్నారు.పొలం పిలుస్తోంది కార్యక్రమంలో చీడ పీడలను గుర్తించి రైతులకు సూచనలు సలహాలు అందించి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించి ఎక్కువ ఆదాయం పొందేటట్లు చేయడమే ఈ కార్యక్రమ ఉదేశ్యం అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ యంపీఈఓ గంగయ్య మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.