Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 16 తర్లుపాడు, మార్చి 16:

మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం లో జగన్నాధపురం మండల ప్రజాపరిషత్ ప్రాధమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కశెట్టి జగన్ బాబు ఘనంగా నిర్వహించారు, తర్లుపాడు బస్టాండ్ లో గల పార్క్ లో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. స్థానిక శ్రీ పొట్టి శ్రీరాములు పార్కులో ఆర్యవైశ్యసంఘంఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు జవ్వాజి విజయ భాస్కర రావు మాట్లాడుతూ, తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. అనంతరం గ్రామ పెద్దలు సూరెడ్డి సుబ్బారెడ్డి, ఈర్ల వెంకటయ్య, వెలుగు కాశీరావులతో కలిసి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకున్నారుప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి, తన ప్రాణాలను పణంగా పెట్టిన అమరజీవిఅనిస్మరించుకున్నారు.ఆయన త్యాగఫలితంగానే భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని వక్తలు తెలిపారు.నేటి యువత పొట్టి శ్రీరాములు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వెన్నా రాజా రామ్ రెడ్డి, భవనం రామకృష్ణ రెడ్డి,గన్నేపల్లి బ్రాహ్మయ్య ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు దోగిపర్తి మల్లిఖార్జున, చినమన గొండ సుబ్రహ్మణ్యం, జవ్వాజి వెంకటేశ్వర్లు, నేరెళ్ల జనార్దన్, చెక్క చెన్నయ్య, కశెట్టి రవి,కొప్పరపు రత్తమ్మ, సూరే సువర్ణ, పెరుమాళ్ళ కృష్ణ వేణి,చినమనగొండ కుమారి, జవ్వాజి వాని స్థానికులు చీకటి శివకాశి తదితరులు పాల్గొన్నారు