జన న్యూస్ ;16 మార్చ్ సోమవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; వై.రమేష్;
సిద్దిపేట అన్ని ప్రక్రియలలో పద్యం యొక్క స్థానం గొప్పదని అవధాని వద్దిపర్తి పద్మాకర్ అన్నారు. సిద్దిపేటలోని లలిత చంద్రమౌళీశ్వర దేవాలయ పదహారో వార్షికోత్సవం సందర్బంగా జరిగిన శతావధానంలో అవధాని డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ పద్యాలతో అలరించారు. సమస్య, వర్ణన, ఆశువు, నిషెద్దాక్షరి తదితర అంశాలపై వంద పద్యాలు అలవోకగా చెప్పి అలరించారు. పండరి రాధాకృష్ణ, ఉండ్రాళ్ళ రాజేశం, సింగీతం నరసింహరావు, మరుమముల దత్తాత్రేయ శర్మ, బ్రోచ్ కార్ ఓంప్రకాష్, చేపూరి శ్రీనివాస్, మిట్టపల్లి సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, దొర్భల ప్రభాకరశర్మ, మంచినీళ్ల సరస్వతి, అశోక్, లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, వీరారెడ్డి, విజయ్ కుమార్, శైలజ, లలిత, శివకుమార్, లక్ష్మణచారి తదితరులు అడిగిన పశ్నలకు పద్యరూపంలో సమాధానమిచ్చారు.


