జనం న్యూస్ 17 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
కేటీఆర్ పైన కక్షపూరితంగా, ఎదుర్కొనే దమ్ము లేక కాంగ్రెస్ సర్కార్ మొయినాబాద్ డ్రగ్ కేసు ను అక్రమంగా అంటగట్టడం దుర్మార్గం బి ఆర్ యస్ వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య కేటీఆర్ యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడితే సహించేది లేదు.ఈ సందర్భంగా గద్వాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ.. డ్రగ్స్ కేస్ వ్యవహారంలో కేటీఆర్ ని ఉద్దేశించి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.మీడియా కవరేజ్ కోసమే అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అయన ఏద్దేవా చేశారు.వెంటనే కేటీఆర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.డ్రగ్స్ పై కేసీఆర్ సర్కార్ ఉక్కు పాదం మోపిందని గుర్తు చేశారు. ఆధారాలు లేకున్నా మొయినాబాద్ ట్రక్స్ కేసును కేటీఆర్ గారికి అంటగట్టడం దుర్మార్గమని మండిపడ్డారు.నిత్యం ప్రజల సమస్యలపై నిర్వహిస్తున్న కేటీఆర్ ను నిలవరించిందికే కాంగ్రెస్ నేతలు నిందలు వేస్తున్నారని ధ్వజం ఎత్తారు. దమ్ముంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు డ్రగ్స్ టెస్ట్ కు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. లేదంటే తోక ముడుచుకొని కూర్చోవాలని ఎద్దేవా పలికారు.బట్ట కాల్చి మీద వేయాలనుకుంటే మీ బట్టలు చిరిగే దాకా కొడతాం కాంగ్రెస్ నాయకుల్లారా !
కేటీఆర్ పై మీరు ఎన్ని అబద్ధపు విష ప్రచారాలు చేసిన ఆయన ఎల్లప్పుడూ ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటారు.సంబంధం లేని విషయాల్లో కేటీఆర్ పేరు ప్రస్తావించి ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడితే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరిస్తున్నాం.మీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతకు తట్టులేక పాలన చేత కాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారే తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదు.ఈ కార్యక్రమం లో చక్రవర్తి,రాజేష్ సుమన్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు


