Listen to this article

జనం న్యూస్ మార్చ్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెం లో వెలిసిన శ్రీ నూకాంబికా అమ్మవారి దేవస్థానంలో 18/3/26/ బుధవారం కొత్త అమావాస్య సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు కారణంగా సాయంత్రం 4.00 నుండి అమ్మవారి దర్శనాలు నిలిపివేయడం జరుగుతుందని, మరల 19/3/26/ గురువారం ఉదయం 6 గంటలు నుండి అమ్మవారి పునఃదర్శనం ప్రారంభం అవుతుందని, కావున భక్తులందరూ సహకరించవలసినదిగా దేవస్థానం చైర్మన్ పీలా నాగ శ్రీను (గొల్ల బాబు), ఆలయ సహాయ కమిషనర్ యాళ్ళశ్రీధర్, ధర్మకర్తలు, తెలియజేశారు.