Listen to this article

జనం న్యూస్ మార్చి 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

మునగపాక మండలం ఉమ్మలాడ గ్రామం నందుగల స్మశాన వాటికను అభివృద్ధి పరిచే చర్యలు చేపట్టాలని అనకాపల్లి జిల్లా డివిఎంసి మెంబర్ మరియు నేషనల్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సూదికొండ మాణిక్యాలరావు అధికారులకు విజ్ఞప్తి చేశారు.గ్రామంలోని ప్రజలు ముఖ్యంగా దళిత వర్గాల ప్రజలు స్మశాన వాటిక గా ఉపయోగించుకునే స్థలాన్ని ఇతర ప్రాంతాల నుండి తీసుకొని వచ్చే చెత్తను వేసే డంపింగ్ యార్డ్ మాదిరిగా తయారు చేస్తున్నారని స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు స్థానిక దళిత ప్రజా సంఘాల నేత లంబా శ్రీనివాసరావు పిలుపు మేరకు మాణిక్యాలరావు గ్రామంలో స్మశాన వాటికకు వెళ్లే మార్గాన్ని లంబ శ్రీనివాసరావు మరియు స్థానికులతో కలిసి పరిశీలించారు. దళిత వర్గాల ప్రజలు స్మశాన వాటిక గా ఉపయోగించుకునే స్థలం అనేక సమస్యలకు నెలవుగా ఉన్నదని అన్నారు కనీసం అది స్మశాన వాటిక మార్గం లా కాకుండా పూర్తిస్థాయిలో డంపింగ్ యార్డ్ మాదిరిగా చెత్తాచెదారాల కుప్పలు తో నిండి ఉన్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామంలోని వారు ఎవరైనా చనిపోతే వారిని అంత్యక్రియల కోసం స్మశాన వాటికకు తీసుకుని వెళ్లే మార్గం అత్యంత దుర్భరంగా ఉందని అంతేకాకుండా అక్కడకు తీసుకెళ్లిన తర్వాత దహన సంస్కారాలు జరిపించడానికి కూడా అక్కడ కనీస సదుపాయాలు లేవని అక్కడ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం స్థానిక దళిత ప్రజా సంఘ నేత లంబా శ్రీనివాసరావు తన సొంత ఖర్చులతో స్మశాన వాటికకు వెళ్లే దారి మీద ఉన్న చెత్త కుప్పలను పక్కకు వేసి దారి ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. అందులకు శ్రీనివాసరావును మాణిక్యాలరావు అభినందించారు. సమస్యను స్థానికులతో కలిసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని వారికి తెలియజేశారు.