జనం న్యూస్ మార్చ్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
శ్రీశ్రీశ్రీ భోగలింగేశ్వర స్వామి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం ధర్మకర్తల మండలి మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ మరియు భక్తుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగిందని దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ తెలియజేశారు. ఇటీవల మహాశివరాత్రి మరియు 28 రోజులకు భక్తులు కానుక రూపంలో హుండీలో ద్వారా వచ్చిన ఆదాయం ₹ 55628 రూపాయలు, మరియు టిక్కెట్ల ద్వారా వచ్చిన ఆదాయం ₹22660… మొత్తం ₹ 78288. విదేశీ కాయిన్స్ యూఏఈ ధీరమ్స్ ₹ 30 విలువ గలిగినవి వచ్చాయని సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి మురళీకృష్ణ హుండీ పర్యవేక్షకులు చంద్ర తేజ ధర్మకర్త మండలి సభ్యులు యలమంచిలి బంగారు రాజు పెంటకోట అనూష గణేష్ రాపేటి లీలా సంతోష్ అర్చకులు పేరూరు చిన్నస్వామి దేవస్థాన సిబ్బంది రామ గణేష్ తదితరులు పాల్గొన్నారు


