Listen to this article

జనం న్యూస్ 17 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

డి కె అరుణమ్మ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఈరోజు వడ్డేపల్లి మండల బిజెపి అధ్యక్షులు బోయ నాగరాజు మరియు టౌన్ అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో ఆర్ఐ సార్ కి కార్యాలయానికి ర్యాలీ గా వెళ్లి కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్ గారు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు చెప్పి అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్న ఇంతవరకు ఏ ఒక్కటి పూర్తి గా అమలు చేయడం లేదని అన్నారు.నిరుద్యోగ భృతి కళ్యాణ లక్ష్మి తులం బంగారం 4000 రూపాయలు పింఛన్లు, రైతుబంధు 12 వేల నుండి 15వేల రూపాయలు పెంచింది లేదు.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కానీ వాటిలో ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు పూర్తిగా అమలు కాలేదు ముఖ్యంగా యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి ,వితంతు, మరియు దివ్యాంగులకు పెన్షన్లు ,కల్యాణ లక్ష్మి పేదల గృహ నిర్మాణ పథకం, రైతులకు రైతు భరోసా, భూ సమస్యల ,పరిష్కారం వంటి అనేక హామీలు ఇప్పటికీ అమలు కావడం లేదు. అలాగే వృద్ధాప్య, వితంతు మరియు దివ్యాంగులకు ప్రభుత్వం అందించే ఆసర పెన్షన్ అర్హులైన లబ్ధిదారులకు అందడం లేదు.మండలంలో దరఖాస్తులు చేసుకున్న అనేకమంది వృద్ధులు వికలాంగులు మరియు ఒంటరి మహిళలకు ఇప్పటికీ పెన్షన్లు మంజూరు కాలేదు అర్హులైన అభ్యర్థులందరికీ దరఖాస్తులను వెంటనే ఆమోదించి వారికి పెన్షన్లు అందించాలని కోరుతున్నాము. పేదలకు ప్రభుత్వం ప్రకటించిన గృహ నిర్మాణ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ఇల్లు మంజూరు చేసి ప్రక్రియను వేగవంతం చేయాలని మనవి చేస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో ప్రజలు దరఖాస్తులు సమర్పించినప్పటికీ వారి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు.ఆ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు నరసింహ ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర ఓబిసి మండల పరుషరాముడు సీనియర్ నాయకులు అశోక్ రాముడు మోహన్ యాదవ్ తదితరు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు