Listen to this article


జనం న్యూస్,ఫిబ్రవరి 12 తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ప్రతి ఏడాది జరిగే క్రీస్తు సువార్త సభలు ముక్కామల ( జేపీఎఫ్) వారి ఆధ్వర్యంలోడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గ్రౌండ్ లో ఘనంగా జరిగాయి. జిపిఎఫ్ వ్యవస్థాపకులు సిహెచ్ మోసే అధ్యక్షతన మూడు రోజులు జరిగే ఈ సువార్త సభలకు ముఖ్య వర్తమానికులు చే దైవ వర్తమానం అందించబడుతుందని సంఘ విశ్వాసులు తెలియజేశారు. ఎంతో ఘనంగా జరిగే ఈ ముక్కామల క్రీస్తు సువార్త సభలకు జిల్లా వ్యాప్తంగా విశ్వాసులు ఈ సభకు వస్తారని స్థానికులు చెప్తున్నారు. సువార్త గాయకులు ఏఆర్ స్టీవెన్సన్, బ్రదర్ సిరివెళ్ల హోనొక్ , అర్కెస్ట్ తో కూడిన మధుర గీతాలు ఆలపించారు. ప్రసిద్ధిగాంచిన వర్తమానుకులు చే బైబిల్లో ఉండే వాక్యాలను సభకు విచ్చేసిన వారికి లోతైన అధ్యాయాలను వివరింప చేశారు. జేపీఎఫ్ సంఘాలైన ముక్కామల, ముత్యాల వారి పాలెం, ఓదురి వారి పాలెం, బొక్క వారి పాలెం, తణుకు సంఘ విశ్వాసులు, జేపిఎఫ్ యూత్,ఈ సభ పరిచర్యలో పాల్గొని సభకు విచ్చేసిన క్రైస్తవ భక్తులకు సదుపాయాలు కల్పించారు. ఈ సభకు చుట్టుపక్క గ్రామాల నుండి భారీ ఎత్తుగా క్రైస్తవ విశ్వాసులు పాల్గొనడం జరిగింది.