Listen to this article

జనంన్యూస్. 17.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు పంట పెట్టుబడి సాయం రైతు భరోసా పథకం ద్వారా ఈ యాసంగికి రైతులకు ఎకరానికి 6000 రూపాయల చొప్పున అందించడం జరుగుతుంది. తేదీ 28/02/2026. వరకు కొత్త పట్టా పాస్ బుక్కులు వచ్చిన రైతులు మరియు ఇప్పటివరకు రైతు భరోసా పొందని రైతులు పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, రైతు భరోసా అప్లికేషన్ ఫారం తో సిరికొండ మండలంలోని రైతు వేదికలో ఏఈఓ లను సంప్రదించగలరు. రైతు భరోసా నమోదు చేసుకోవడానికి చివరి తేదీ 25-03-2026. కావున మండలంలోని రైతులు అందరూ రైతు భరోసాను ఉపయోగించుకోవాలని కోరుతున్నాము