Listen to this article

పేద ముస్లిం కుటుంబాలకు అండగా నిలిచిన ముస్లిం మైనారిటీ, యూనిటీ ఆఫ్ ఉమ్మహ్

జనం న్యూస్-మార్చి 17- నాగార్జునసాగర్ టౌన్-

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం మైనారిటీ మరియు యూనిటీ ఆఫ్ ఉమ్మహ్ ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాను పంపిణీ చేశారు,పవిత్ర రంజాన్ మాసంలో ఎంతో నిష్టతో నెల రోజులు ఉపవాసాలు ఉండి భక్తి శ్రద్ధలతో జరుపుకోనున్న రంజాన్ పండుగను అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో పేద ముస్లీం మైనారిటీ లకు రంజాన్ తోఫాను మైనారిటీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్(ఈ ఈ//25) నందు 30 మంది ముస్లిం కుటుంబాలకు అందచేశారు, అనంతరం హిల్ కాలనీ మెయిన్ బజార్ కు చెందిన మహమ్మద్ గని 30 మంది ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూనిటీ ఆఫ్ ఉమ్మహ్ సభ్యులు మాట్లాడుతూ రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనమని పవిత్ర రంజాన్ పండుగ వేళ అందరి కుటుంబాలలో సంతోషం నింపాలనే లక్ష్యంతో ముస్లిం మైనారిటీ, యూనిటీ ఆఫ్ ఉమ్మహ్ ఆధ్వర్యంలో రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టే పేద ముస్లిం కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో గత రెండు సంవత్సరాలుగా ఈ రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎండి వహీద్, ఎస్ డి జానీ, ఎండి తాజుద్దీన్, ఎండి రషీద్, ఎస్ డి షబ్బీర్, ఎండి గని, ఎస్.కె సుభాని, ఎస్ కే భాష, ఎస్ డి ఇబ్రహీం, ఎంఏ నసీర్, ఎస్.కె షరీఫ్, ఎస్.కె.అస్గర్, షఫీ, జి నజీరుద్దీన్, ఎస్ డి నజీరుద్దీన్ ముస్లిం మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.