Listen to this article

జనం న్యూస్- మార్చి 17- నాగార్జున సాగర్ టౌన్-

నాగార్జునసాగర్ హిల్ కాలనీకి చెందిన పోలోజు సైదాచారి లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాదులోని ఓవైసీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం స్థానికుల ద్వారా తెలుసుకొని విబిఎన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి నినన్ ఈరోజు ఓవైసీ హాస్పిటల్ వద్ద సైదాచారి తండ్రి పోలోజు శ్రీనివాసాచారి నీ కలసి ఆర్థిక సహాయం అందజేశారు. సైదాచారి ఆరోగ్య విషయమై ఓవైసీ హాస్పిటల్ డాక్టర్లను సంప్రదించగా ప్రస్తుతం సైదాచారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని త్వరలోనే ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేయనున్నట్లుగా తెలిపారన్నారు. దాసరి నినన్ మాట్లాడుతూ సైదాచారి వైద్యానికి అధిక మొత్తంలో ఖర్చు అవుతుందని కావున దాతలు సహకరించి తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించగలరని కోరారు. విబిఎన్ ఫౌండేషన్ డైరెక్టర్ నూకల చెన్నారెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలో విబిఎన్ ఫౌండేషన్ సంస్థ ముందు ఉంటుందని అన్నారు.