బిచ్కుంద మార్చి 17 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బాలికలపై జరుగుతున్న నేరాలు, సైబరు నేరాలు,వేసవి కాలంలో తీసుకోవలిసిన జాగ్రత్తలు వివిధ సామజిక అంశములపై అవగాహన కల్పించడం జరిగింది.కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ రాజేష్ చంద్ర ఐపీయస్ ఆదేశానుసారం బిచ్చుకుందా సబ్-ఇన్స్పెక్టర్ రాజు ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందంచే అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.షి టీమ్ నం 8712686094 ,సైబర్ నేరాల టోల్ ఫ్రీ నం 1930,
అత్యవసర సమయంలో డైల్ 100 కాల్ చేయాలని తెలిపారు.ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని మంచి లక్ష్యంతో చదువు కోవాలని ఏచిన్న పొరపాటు చేసిన జీవితాలు నాశనం అవుతాయని అన్నారు.తల్లి తండ్రులు చెప్పినట్టు వినాలని పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్.రామంచ తిరుపతి,హెడ్ కానిస్టేబుల్ యు.శేషరావు పిసి.సాయిలు మాటలు పాటలు ద్వారా అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో షి టీమ్.సభ్యులు PC.అనిల్, WPC.పార్వతి,ప్రిన్సిపాల్ రాగిణి ఉపధ్యాయు బృందం, విద్యార్థినిలు పాల్గొన్నారు.




