బజరంగ్ దళ్ నాయకుడు నాయుడు డిమాండ్ జనం న్యూస్ మార్చ్ 17 అమలాపురం
హిందువుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన
పాస్టర్ పై కఠిన చర్యలు, నాన్ బేల్ బుల్ కేసు నమోదు చేయాలని విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకుడు శిరంగు నాయుడు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో దర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలం లో అక్రమంగా నిర్మించిన చర్చను తొలగించాలన్నారు. చర్చకు అక్రమ విద్యుత్ కనెక్షన్ కలిగి ఉన్నాడని, అతని కుల ధ్రువీకరణ పత్రాన్ని కూడా తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన బజరంగీలు అనంతరం కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు.


