జనం న్యూస్ మార్చి 18: నిజామాబాద్ జిల్లా
ఏర్గట్లమండలం లోని తడపాకల్ గోదావరి నది తీరాన గల శ్రీ దత్త సాయిబాబా మందిరము పంచమ వార్షికోత్సవం సందర్భంగా మార్చి 20, 21, 22 తేదీలలో మూడు రోజులపాటు “విజ్ఞాన మహాసభలు” నిర్వహించనున్నట్లు ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ నిర్గుణ తత్వ మహారాజ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ధర్మ ప్రచారకులు కంకణాల రాజేశ్వర్, శ్రీ మకరంద సమాజ సేవా సంస్థ భక్తబృందంతో కలిసి బుధవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.మహారాజ్ మీడియాతోమాట్లాడుతూ, మూడు రోజులపాటు సుప్రభాతం, గీతా పారాయణం,ఉదయం–సాయంత్రం మహాత్ముల ఆధ్యాత్మిక ప్రవచనాలు, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు.ఈ కార్యక్రమం జరుగుతున్న మూడు రోజులపాటు భక్తులకు అన్నదాన సత్రం కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.ఇందూరు జిల్లా ప్రజలు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని ఆశ్రమాలయ వ్యవస్థాపకులు, స్వాములు, ధార్మికులు, వైదికులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు


