జనం న్యూస్ 18 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
మట్టిలోనే మాణిక్యాలు అంటే ఇదే నిదర్శనం.విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఉన్నత స్థాయిలో ఎదగాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే నవోదయ ప్రవేశ పరీక్షలు సీటు సాధించిన 16 మంది విద్యార్థులను సన్మానించిన ఎమ్మెల్యే ..ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నందు నవోదయ పరీక్ష లో ఇటీవలే వెలువడిన ఫలితాలలో జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండల కేంద్రంలో ఆదర్శ విద్యా మందిర్ 30 మంది విద్యార్థులు నవోదయ గురుకుల శిక్షణ కోచింగ్ పొందిన విద్యార్థులలో గద్వాల అల్లంపూర్ సంబంధించిన 16 మంది విద్యార్థులు సీట్లు సాధించిన సందర్భంలో గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విద్యార్థులకు శాలువా శాలువా కప్పి ఘనంగా సత్కరించడం జరిగినది.16 మంది విద్యార్థులు నవోదయ ప్రవేశ పరీక్షలు సీట్లు సాధించడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే .ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా గద్వాల నియోజకవర్గం లో దినదిన విద్యారంగంలో అభివృద్ధి పొందడం జరుగుతుంది. గత సంవత్సరం గట్టు మండలానికి సంబంధించిన 12 మంది విద్యార్థులు ఎంబిబిఎస్ లో సీట్లు సాధించడం జరిగింది . అదేవిధంగా గద్వాల నియోజకవర్గం లో కూడా వివిధ ప్రభుత్వ రంగాలలో విద్యార్థులు ఉద్యోగాలను సాధించడం జరిగిందని తెలిపారు.గతంలో గద్వాల నియోజకవర్గం అక్షరాసతలో వెనుకబడిన ఉండేది ఇప్పుడిప్పుడే గద్వాల నియోజకవర్గం అక్షరాసతలో మెరుగైన ఫలితాలను సాధించడం జరుగుతుంది ముఖ్యంగా గట్టు మండలంలోని విద్యార్థులు అక్షరాస్యతలో ముందు వైపుగా అడుగులు వేస్తున్నారు.గద్వాల జిల్లాలోని ఐజ మండల కేంద్రంలో ఆదర్శ విద్యా మందిరంలో 30 మంది విద్యార్థులు నవోదయ గురుకుల కోచింగ్ పొందే ఇందులో 16 మంది విద్యార్థులు నవోదయ ప్రవేశ పరీక్షలలో గద్వాల ప్రాంతానికి చెందిన 11 మంది విద్యార్థులు సీట్లు సాధించడం చాలా సంతోషంగా ఉన్నది అని హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా అల్లంపూర్ కు సంబంధించిన ఐదు మంది విద్యార్థులు కూడా సీటు సాధించడం జరిగిందని తెలిపారు ప్రతి ఒక్క విద్యార్థి చిన్నప్పటినుండే మంచిగా చదువుకోవడం వల్ల భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి వెళ్లి విద్యార్థులు ప్రభుత్వ రంగాలలో ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు విద్యార్థుల చిన్నప్పుడు నుంచి మంచిగా చదువుకోవాలి వారి తల్లిదండ్రులు కూడా ప్రతి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే విధంగా కృషి చేయాలని కోరారు..ప్రతి ఒక్క విద్యార్థి ఈ విద్యార్థులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు..భవిష్యత్తులో విద్యారంగా అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ విజయ్ కుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.


