Listen to this article

జనంన్యూస్. 18.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.

నిజామాబాదు.సురేష్ భౌతికకాయానికి నివాళులర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా.
ఇందూరు: బీజేపీ నాయకుడు, మాజీ కార్పొరేటర్ పంచ రెడ్డి సురేష్ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త విచారం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఎమ్మెల్యే బుధవారం హుటాహుటిన ఇందూరుకు చేరుకొని, ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న నాయకుడు సురేష్ అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన సతీమణి పంచరెడ్డి అనిత భారీ మెజారిటీతో విజయం సాధించడం వెనక సురేష్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. అందరినీ కలుపుకొనిపోయే మనస్తత్వం ఉన్న నాయకుడని తెలిపారు. కార్పొరేటర్ గా ప్రజాసేవ చేస్తూ డివిజన్ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నాడని కొనియాడారు. మృదుస్వబావిగా పేరు తెచ్చుకున్న ఆయన గుండెపోటుకు గురికావడం తీవ్రంగా కలచివేసిందన్నారు. వారి కుటుంబానికి బీజేపీ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. అనంతరం కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని అందించారు.