Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు మార్చ్ సెల్ 9550978955

చిలకలూరిపేట స్థానిక తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం మ్యాక్సీవిజన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరాన్నితహశీల్దార్ మొహమ్మద్ హుస్సేన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాన్యులకు మెరుగైన వైద్యం అందించేందుకు డాక్టర్ రామలింగారెడ్డి బృందం చేస్తున్న కృషి భినందనీయమన్నారు.సాయంత్రం వరకు జరిగిన ఈ శిబిరాన్ని ప్రజలు పెద్ద సంఖ్యలో సద్వినియోగం చేసుకున్నారు.అనంతరం తహశీల్దార్ స్వయంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ వెంకటేశ్వరరావు, కార్యాలయ సిబ్బంది మరియు ఆసుపత్రి ప్రతినిధులు పాల్గొన్నారు.