

జుక్కల్ ఫిబ్రవరి 12 జనం న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు చట్టభద్దత కల్పించడంతో పాటు షెడ్యూల్ కులాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో మాదిగ ప్రజా ప్రతినిధులతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.ఈ సందర్బంగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ముందుకు రాకపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి వర్గీకరణ అంశంపై ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేసి, వర్గీకరణకు చట్టభద్దత కల్పించడానికి శాసన సభలో చర్చించి, షెడ్యూల్ కులాలకు ఏ.బీ.సీ కేటగిరీలలో రిజర్వేషన్లు అమలు చేయడానికి కార్యాచరణ ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ, మాదిగ ఉప కులాల తరపున ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..