Listen to this article

జనం న్యూస్ ; 19మార్చ్ గురువారం; సిద్ధిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్

జాతీయ సాహిత్య పరిషత్ సిద్దిపేట వారు ప్రెస్ క్లబ్, సిద్దిపేటలో నిర్వహించిన పరాభవ నామ ఉగాది కవి సమ్మేళనం ఎంతగానో అలరించింది. ముఖ్య అతిధిగా హాజరైన కథాశిల్పి ఐతా చంద్రయ్య మాట్లాడుతూ తెలుగు లోగిళ్ళలో ఉగాది పండుగ కొత్త కాంతులు నింపుతుందని, నూతన సంవత్సర శోభలు ఉగాదితో ప్రారంభమౌతుందన్నారు. కవి చీకోటి రాములు రచించిన అక్షర భారతి బాలగేయ సంపుటి పుస్తకావిష్కరణ జరిగింది. అధ్యక్షులు ఎన్నవెళ్ళి రాజమౌళి, ప్రధాన కార్యదర్శి ఉండ్రాళ్ళ రాజేశం, కొమురవెళ్ళి అంజయ్య, డాక్టర్ సుధాకర్, బస్వ రాజ్ కుమార్, కోణం పర్శరాములు, గంగాపురం శ్రీనివాస్, కాల్వ రాజయ్య, పెందోట వెంకటెశ్వర్లు, మల్లంల కనకయ్య, శ్రీచరణ్ సాయిదాస్, పిన్నింటి మహేందర్ రెడ్డి, అనిశెట్టి సతీష్ కుమార్, దుడుగు నాగలత, యాడవరం చంద్రకాంత్, తాళ్ళ యేసురాజు తదితరులు పాల్గొన్నారు.