Listen to this article

జనం న్యూస్;20 మార్చ్ శుక్రవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్

తెలంగాణ అస్తిత్వం: రంజాన్ పండుగను పురస్కరించుకుని స్థానిక రుస్తుం ఆర్ట్ గ్యాలరి సిద్దిపేట లో నేడు శుక్రవారం “నూరే ఈదుల్ ఫితర్ రంజాన్ ముబారక్ చిత్రాన్ని ప్రఖ్యాత అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగలు సమాజాలను కళావంతం చేస్తాయని, రంజాన్ పండుగ సోదరభావం సహజీవనం సామరస్యం ఐకమత్యానికి ప్రతీక అని అన్నారు. బిదవాడు ఆకలితో అలమటిస్తుంటే ధనవంతులు స్పందించాలని, జఖాత్ విధిగా ఉన్నవారు, లేనివారికి ఉన్నదాంట్లో కొంత రెండున్నర శాతం, తప్పకుండా దానము చేయాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైవసల్లం అల్ ఖురాన్ లో తెలియజేశారన్నారు. దానివల్ల ఎంతోమంది బీదలకు సహకారం అందించి వారి బాధలు తీర్చాలన్నారు. అల్ ఖురాన్ విధి విధానాలను పాటించి అల్లాబీతితో ఆరోగ్యంగా ఉండాలన్నారు, రంజాన్ పండుగ ప్రపంచ మానవాళికి సామరస్యం సౌభాతృత్వం ఐకమత్యం సుఖ సంతోషాలు శాంతి భద్రతలు అందించాలని మానవతా చిత్రకారులు రుస్తుం ఆకాక్షించి అందరికి రంజాన్ ముబారక్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం నైరూప్య చిత్రకారుడు నహీంరుస్తుం, మహ్మద్ సాధిక్, ఎండి రహీం, అసిస్టెంట్ ప్రొఫెసర్ రుబీనారుస్తుం, తదితరులు పాల్గొని రంజాన్ ముబారక్ తెలియజేశారు.