జనం న్యూస్ మార్చ్ 20 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
స్థానిక బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి సత్యాస్ లక్ష్మి గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ సిల్వర్ జూబ్లీ మహోత్సవాలు, ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 2001 లో క్లబ్ స్థాపించమని, అప్పటినుండి ఇప్పటివరకు అధ్యక్షులను, కార్యదర్శిలను, ప్రస్తుత పాలకవర్గ సభ్యులను అందరిని ఘనంగా సత్కరించారు. ఈవెంట్ ఆర్గనైజర్ కర్రీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు చేసే భరతనాట్యం, తెలంగాణ బోనాలు నృత్యం, పలు సంస్కృత కార్యక్రమాలు క్లబ్ సభ్యులకు ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ. క్లబ్ స్థాపించి ఈ ఏడాదికి 25 సంవత్సరాలు పూర్తయిందని, సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఘనంగా జరిగిందని తెలియజేశారు.తెలుగు తొలి పండగ ఉగాది ఉత్సవాలు బెస్ట్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషంగా ఉండాలి అని తెలియజేశారు. తెలుగు సంస్కృతి మనకే కాకుండా మన పిల్లలు కూడా అలవాటు చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమూ,గౌరవ అధ్యక్షులు నర్సింగరావు, చైర్మన్ పిఎస్అప్పారావ్ ,అధ్యక్షులు బి ఎస్ ఎం కె జోగి నాయుడు,కార్యదర్శి పెంటకోట ప్రభాకర్, కోశాధికారి భర్సికాన శ్రీనివాసరావు, జాయింట్ సెక్రెటరీ. బుద్ధశివ, ఉపాధ్యక్షులు భీమర శెట్టి శ్రీనివాసరావు,క్లబ్ డైరెక్టర్లు
బుద్ధ శ్రీనివాసరావు, బుల్లప్పల నాయుడు, బుద్ధ లక్ష్మణరావు, బొడ్డేడ రాజేష్, పీవీ సత్యనారాయణ, కాండ్రేగుల జగ్గారావు, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


